చాలా రోజుల నుంచి అంటే నన్ను నేను మోసం చేసుకున్నాట్టవుతుంది..... నిజానికి చాలా సంవత్సరాలనుంచి నా రచనా వ్యాసంగాన్ని పక్కన పెట్టేశాను. కారణాలనేకం ఉన్నా, ప్రధాన కారణం మాత్రం ఉద్యోగ వత్తిడి అని చెప్పక తప్పదు. పొద్దుపొడవక ముందే బయలుదేరితే, పొద్దుపోయాక తిరిగి ఇంటికి చేరడం... అలసటతో మంచం చేరి ముసుగు తంతే తిరిగి మర్నాడు పొద్దున ... రాట్నంలా గిరగిర తిరగడం... ఈ చక్రభ్రమణంతో జీవితం మరీ రొటీన్ అయిపోయింది. అభిరుచులే కాదు అభినివేశాలు కూడా మారిపోయాయి. సృజనాత్మకత ఎక్కడికో పారిపోయింది. కధలు, కవితలు, నాటికలు, నాటకాలు...అన్నీ కాలంతో పాటు గిరగిర తిరుగుతూ ఎక్కడో మూలలో ఇరుక్కుపోయాయి. ఎప్పుడైనా ఎవరైనా గుర్తుచేస్తే,,,,, ఒహో... ఒకప్పుడు కవితలు రాశాను కదా... నా కథ ఫలానా పత్రికలో ముద్రించారు కదా అనుకుంటూ ఒక్క నిట్టూర్పు తప్ప ... ఊహల్లో విహరించడం మానేశాను. ఎందుకో ఈ రోజు స్నేహితులు గుర్తుచేస్తే, నేను కూడా బ్లాగ్ రాసేవాణ్ణి కదా అని గుర్తొచ్చి, ఆ పేజీ ఎక్కడుందో అని వెతుక్కుని, ఇదిగో ఇలా ఈ నాలుగు మాటలు ....
No comments:
Post a Comment